పిఠాపురం పట్టణం బొజ్జవారితోటలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారిచే చట్టాలు, ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. 12వ అదనపు జిల్లా జడ్జి వాసంతి ఆదేశాల మేరకు మండల న్యాయాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులు చట్టాలపై అవగాహన కల్పిస్తూ లోకదాలత్లో కేసులు సత్వర పరిష్కారం చేసుకోవచ్చన్నారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.