పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం పట్టణంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేరాబత్తుల రాజశేఖరం సతీమణి సత్యవాణితో కలసి శుక్రవారం పిఠాపురం పట్టణం, కోటగుమ్మం సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ శ్రేణులందరూ కూటమి అభ్యర్థి రాజశేఖర్ గెలుపునకు కృషి చేయాలని మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు.