ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ.. రాజశేఖరం సతీమణి పేరాబత్తుల సత్యవాణితో కలసి పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ లో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ లోక్ సభ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.