ఉప్పాడ కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి సరఫరా చేసిన కల్తీ డీజిల్ వల్ల వేటకు వెళ్లిన వారి బోట్లు నడిసముద్రంలో నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రాణాలకు తెగించి వేటకు వెళ్లిన తమ జీవనోపాధి నిర్లక్ష్యం కారణంగా దెబ్బతిందని, బోట్ల ఇంజన్లు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బంక్‌ను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని శనివారం కోరారు.