రాజమండ్రిలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి

69చూసినవారు
రాజమండ్రిలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి
రాజమహేంద్రవరం పుష్కరాలరేవు సమీపంలో సోమవారం రాత్రి పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 10 మంది ఈదుకుంటూ ప్రాణాలు దక్కించుకున్నారు. మొత్తం 12 మంది గోదావరి నదిలోని బ్రిడ్జిలంక వద్దకు మద్యం పార్టీకి వెళ్లగా, తిరుగు ప్రయాణంలో పడవ నీటితో నిండిపోయింది. ఈత తెలిసిన వారు సురక్షితంగా బయటపడ్డారు. భవానీపురానికి చెందిన గాడా రాజు (23), కోటిలింగాలపేటకు చెందిన చెవల అన్నవరం (54) మృతి చెందారు. అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్