రాజమండ్రి సమీప ప్రాంతాలలో సంచరిస్తున్న చిరుత పులిపై ఏమైనా సమాచారం తెలిస్తే 18004295909 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి భరణి కోరారు. ఆదివారం రాజమండ్రిలో ఆమె మాట్లాడారు. చిరుత పట్టుబడేంతవరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత బయట తిరగవద్దని సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే టార్చ్‌లైట్ తీసుకెళ్లాలని సూచించారు.