రోగ నిరోధక శక్తి పెంపొందించడం ద్వారా టీబీ నుంచి విముక్తి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. రాజమండ్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రధానమంత్రి టీబీ విముక్తి భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా నిక్స్ యా మిత్రా హోదాలో బాలికను దత్తత తీసుకున్నారు. బలవర్ధకమైన ఆహారంతో పాటు శారీరక వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. టీబీని పారద్రోలుదామని సూచించారు.