తూ. గో జిల్లా స్థాయి యువ ఉత్సవాలలో యువత పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవడానికీ చక్కటి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపు ఇచ్చారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా యువ ఉత్సవ్ - గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. యువతను ప్రోత్సహించడంతో పాటు వారిలో నీభిడీకృతమైన ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా యువ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.