కడియం: లబోదిబోమంటున్న నర్సరీ రైతులు

84చూసినవారు
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీల నుంచి ప్రతి ఏటా లక్షలాది మొక్కలు కొనుగోలు చేసి తీసుకెళ్తారు. పండుగల నేపథ్యంలో అలంకరణకు చామంతి మొక్కలను కొనుగోలు చేస్తుంటారు. సాధారణంగా ఈ మొక్కలు సైజును బట్టి ఒక్కొక్క మొక్క రూ. 100 నుంచి రూ. 150కు అమ్మకాలు సాగిస్తారు. కాని ఇప్పుడు కొనేవారు లేకపోవడంతో రూ. 50 నుంచి రూ. 100 కి తగ్గించి అమ్ముతున్నా నర్సరీల నుంచి ఈ అందాల చామంతులు కదలడం లేదని రైతులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్