కడియం: రైతుల కోసం గిట్టుబాటు ధరలు

62చూసినవారు
కడియం మండలం మాధవ రాయుడుపాలెం పంచాయతీ గుబ్బలవారి పాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ చేతుల మీదగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల కోసం గిట్టుబాటు ధరలు కల్పించిందని, పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నందేవుల చంటి, జిల్లా సివిల్ సప్లై అధికారి రాధిక తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్