మత్స్యకార కుటుంబాల జీవనోపాధి ప్రమాణాలను పెంచే దిశగా వారిలో సాంకేతిక కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంచి, మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ప్రపంచ మత్స్యదినోత్సవం సందర్భంగా ధవలేశ్వరం బ్యారేజ్ సమీపంలో కలెక్టర్ అధికారులతో కలిసి 35 లక్షల చేప పిల్లలను గోదావరి నదిలో వదిలారు. తొలుత కలెక్టర్ మత్స్యకారుల సంఘాల ప్రతినిధులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.