రాజమండ్రి: రాయచోటిలో దాడి చేసిన వారిని శిక్షించాలి

65చూసినవారు
రాయచోటిలో వీరభద్రస్వామి ఉత్సవాలపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ నుంచి బొమ్మూరు కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు రాధా మనోహర్ దాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. హిందువులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్