తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి, తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారక రామారావు ఆశయ సాధనలో నేటితరం ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం రామచంద్రపురం టిడిపి కార్యాలయంలో మంత్రి సుభాష్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.