ఈనెల 26వ తేదీన జరిగే మహాశివరాత్రికి దేవీపట్నం మండలంలోని పాతదేవీపట్నం వద్ద గోదావరి నదిలో స్నానాలకు అనుమతి లేదని ఎస్ఐ షరిఫ్ మంగళవారం తెలిపారు. బుధవారం పాతదేవీపట్నం ఉమా చౌడేశ్వరస్వామిని దర్శించుకుని భక్తులు అక్కడ ఏర్పాటుచేసిన జల్లు స్నానం వద్ద మాత్రమే స్నానాలు చేయాలన్నారు. ఆలయ కమిటీ సభ్యులకు పోలీసులకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.