అడ్డతీగలలో ముగ్గురు అరెస్ట్

70చూసినవారు
అడ్డతీగలలో ముగ్గురు అరెస్ట్
అడ్డతీగల మండలం కొట్టంపాలెంలో ఆదివారం ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. సీఐ శ్రీధర్ వివరాల మేరకు నిందితులు నిర్వహించే సారా బట్టీలపై దాడి చేశామన్నారు. 3, 200 లీటర్లు బెల్లం ఊట, బట్టీలు ధ్వంసం చేసినట్లు వివరించారు. ఒక బైక్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులకు బెల్లం సరఫరా చేసే వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్