రాజోలు మండలం తాటిపాక జెడ్పీహెచ్ స్కూల్లో 1999-2000 పదో తరగతి బ్యాచ్ చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలను నెమరువేసుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను సన్మానించారు.