తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరావు టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయనతో పాటు ఇటీవల తొండింగి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ యనమలను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ. శాంతిభద్రతలు పరిరక్షించాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.