ప్రజలకు మేలు జరిగే విధంగా పార్టీ క్యాడర్ అంతా పనిచేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తేటగుంట టిడిపి కార్యాలయంలో తుని, కోటనందూరు, తొండంగి, తుని పట్టణానికి చెందిన నాయకులతో ఆయన సమావేశం గురువారం నిర్వహించారు. నాయకులతో చర్చించి నియోజవర్గ సమస్యలపై ఆరా తీశారు. యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతమనీడు అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరు వెంకటేష్, మల్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు.