అమలాపురం: రైస్ మిల్లుల రాండమైజేషన్ రద్దు: జేసీ
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందికరంగా మారిన రైసు మిల్లుల ర్యాండమైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. శనివారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ ధాన్యం సేకరణకు సంబందించి ప్రభుత్వం అమలు చేయనున్న విధివిధానాలపై అవగాహన కల్పించారు.