విజయవాడలో ఈ నెల 9వ తేదీన జరగనున్న బీసీ కులాల మహా ధర్నాను విజయవంతం చేయాలని కొత్తపేట నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పార్టీ కార్యాలయంలో బిసి కుల జనగణన మహాధర్నా పాంప్లెట్ ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ కాండ్రేగుల గంగరాజు మాట్లాడుతూ బి. సి కులాలు ఈ ధర్నా లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.