ప. గో. జిల్లాలోని అంగన్‌వాడీ పిల్లల నమోదుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంప్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో నమోదు కాబడిన 0 - 6 సంవత్సరాల పిల్లలకు కొత్త ఆధార్ కార్డు నమోదు చేయుటకు ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు, 27 నుంచి 30 వరకు క్యాంప్‌లు జరుగుతాయన్నారు.