దెబ్బతిన్న ప్రధాన రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే
ఏలూరు రూరల్ మండలం గుడివాక లంక గ్రామంలో దెబ్బతిన్న ప్రధాన రహదారులను గురువారం ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. దెబ్బతిన్న రహదారుల నిర్మాణాలు సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ఈసందర్భంగా చింతమనేని మాట్లాడుతూ ఏలూరు కైకలూరు ఆర్ అండ్ బి రహదారి, ఏలూరు గుడివాక లంక ప్రధాన రహదార్లు భారీగా దెబ్బతిన్నాయని అన్నారు.