నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కోలుసు పార్థసారథి గురువారం మానవత్వం చాటుకున్నారు. ఏలూరు నుంచి విజయవాడ వెళుతుండగా జాతీయ రహదారిపై కలపర్రు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడుకు చెందిన శిరీష, ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుకు వెళుతున్న మంత్రి కోలుసు పార్థసారథి ప్రమాదాన్ని చూసి తన కాన్వాయిని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.