పామర్రు: సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు
పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా ఆదివారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పమిడిముక్కల మండలం గోపువారిపాలెం గ్రామంలో జరిగినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తాడిశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు సెమీ క్రిస్మస్ వేడుకలను తిలకించుట కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.