పామర్రు మండలం కురుమద్దాలి ఫ్లైఓవర్ వద్ద ఆదివారం ఆటో బోల్తా పడింది. దింతో 14 మంది కూలీలకు గాయాలు అయ్యాయి. మచిలీపట్నం మండలం మల్లవోలు నుంచి పెనమలూరు వైపు వెళుతుండగా టైర్ పగలడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డరు. గాయపడిన కూలీలకు ప్రయాణికులు సపర్యలు చేశారు.