రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతుకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేశారా అని పామర్రు మాజీ శాసనసభ్యులు, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం పామర్రులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడుతూ రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధరని ప్రకటించకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.