భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పెంటపాడు గ్రామంలో ఆదివారం సిపిఎం నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిరపవరపు రంగబాబు మాట్లాడుతూ అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తనను మంత్రి పదవి నుండి ప్రధానమంత్రి తక్షణమే తొలగించాలని సిపిఎం పార్టీగా ఖండించడం జరిగింది.