తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో జాతీయ విద్యా విధానం-2020 ప్రాముఖ్యత కృత్రిమ మేధా కృషి అనే అంశంపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిట్ డైరెక్టర్ (మణిపూర్) ప్రొఫెసర్ సోమయాజులు పాల్గొని మాట్లాడారు. ఫ్లికర్స్ యాప్, ఈడీ ఫజిల్, గామా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ రూపొందించిన యాప్‌లను బోధన విధానంలో అమలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.