రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న రోడ్ల పనులపై రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఏలూరు ఎంపీ పూట్ట మహేష్ కుమార్, ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. శనివారం భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు.