కలెక్టర్ కార్యాలయంకు పోటెత్తిన భాదితులు
వరద సహాయం అందలేదని కలెక్టర్ కార్యాలయంకు మంగళవారం భాదితులు పోటెత్తుతున్నారు. తమ ఇల్లు నీట మునిగిన పేర్లు లేవని ఆందోళన చేపట్టారు. డోర్ లాక్ అని, నో డ్యామేజి అని చెప్పడం పై భాదితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదని పేరున్నప్పటికి పరిహారం అందలేదని కొందరు, వాహన నష్ట పరిహారం దక్కని వారు కోకొల్లలుగా బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.