వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. గురువారం ఉదయం పోలీసులు హైదరాబాద్ నుంచి ఆయను ఇక్కడికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, ఆయనకు న్యాయస్థానం గురువారం 2వారాలు రిమాండ్ విధించింది. మాజీ ఎంపీని కోర్టుకు తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.