బాపట్ల పట్టణంలో ఆదివారం వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా బాపట్ల జిల్లా వైద్య శాఖ అధికారిణి విజయమ్మ జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ర్యాలీలో నినాదాలు చేశారు. కళాశాల, పాఠశాల, ఎన్ సి సి విద్యార్థుల తోపాటు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లతో భారీ ర్యాలీ జరిగింది. పారా లీగల్ వాలంటరీ పఠాన్ మహమ్మద్ ఖాన్ పాల్గొన్నారు.