మంత్రి లోకేశ్ ఆదేశాలతో మంగళగిరి నగరంలోని వీటిజేఎమ్ &ఐవీటీఆర్ కళాశాలలో ఆదివారం జరుగుతున్న మెగా జాబ్ మేళా విశేష స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 60కి పైగా కంపెనీలు హాజరయ్యాయి. 5వేల మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. దీంతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.