బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు సక్రమంగా చేయాలని పెదకూరపాడు మండల తహసిల్దార్ డానియేలు కోరారు. బుధవారం తహసిల్దార్ కార్యాలయం వద్ద బూత్ లెవెల్ ఆఫీసర్ల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ స్పెషల్ సమరి రివిజన్ 2025 కొరకు సమావేశం నిర్వహించారు. ఈనెల 20వ తేదీ నుండి బిఎల్వోలు ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్ల చేర్పులు తొలగింపులు మరణించిన వారి జాబితా తయారు చేయాలన్నారు.