
చెరుకుపల్లి: కాలనీ ప్రజలు విద్యపై అవగాహన కలిగి ఉండాలి
చెరుకుపల్లి మండలం కావూరు గ్రామం ఎస్టి కాలనీలో వైఎస్ఆర్సిపి ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చౌటురి రమేష్ పర్యటించారు. కాలనీలోని ప్రతి తల్లిదండ్రులు చైతన్యం కలిగి ఉండాలని, విద్య పట్ల అవగాహన కలిగి తమ పిల్లల ఆరోగ్యం, చదువులపై శ్రద్ధ కలిగి ఉండాలని ఆయన సూచించారు. అనంతరం కాలనీ ప్రజలతో మాట్లాడి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు.