

వేటపాలెం: శాంతియుతంగా అమ్మవారి ప్రతిష్ట జరగాలి
వేటపాలెంలో శ్రీ పల్నాటి అంకమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆదివారం జరుగుతున్నందున శాంతియుత వాతావరణంలో ప్రతిష్ట కార్యక్రమం జరుపుకోవాలని ఎస్సై వెంకటేశ్వర్లు శనివారం రాత్రి తెలిపారు. ప్రతిష్టకు వచ్చే భక్తులందరూ తమ సామాన్లు, నగదును జాగ్రత్తగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.