రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో శనివారం గడ్డివాము దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండపల్లి హిమాంస అనే వ్యక్తి యొక్క నాలుగు ఎకరాల గడ్డివాము ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోయింది. రెండో శనివారం కావడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మోటార్ వేసి మంటలు ఆర్పడానికి లేకుండా పోయిందని గ్రామస్థులు తెలిపారు. ఈ నేపథ్యంలో గడ్డివాము పూర్తిగా దగ్ధమైనట్లు పేర్కొన్నారు.