వినుకొండ నియోజకవర్గ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగాయి. ఎన్నికల్లో బొడ్డుచర్ల ప్రసాదరావు అధ్యక్షుడిగా, ఎం. మూర్తి, ఆర్. శంకర్ ఉపాధ్యక్షులుగా, కే. వందనం బాబు సెక్రటరీగా, సిహెచ్. బాజీ, బీరం శ్రీను సహాయ కార్యదర్శిలుగా, ఎస్. కె. సైదా ట్రెజరర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ కమిటీ రెండు సంవత్సరాలు కొనసాగించనుంది.