జమ్మలమడుగు మండలం పి. బొమ్మేపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 1500 గొర్రెలు, 257 మేకలు, 36 దూడలు, 62 గేదెలకు నట్ట నివారణ, ఏలిక పాముల మందు వేసినట్లు తెలిపారు. 8 గర్భకోశ చికిత్సలు, 6 చూలు పరీక్షలు 85 సాధారణ చికిత్సలు 35 కోళ్లకు తెగుళ్ల నివారణకు టీకాలు దూడలకు గొంతువాపు టీకాలు వేశారు. డాక్టర్ జి జాన్ సుధాకర్ బాబు, సహాయక సిబ్బంది పాల్గొన్నారు.