జమ్మలమడుగు పట్టణంలోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో బీసీ సంక్షేమ సంఘం ఆవిర్భావ సభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివారం సమన్వయకర్త బొర్రా రామాంజనేయులు ఆధ్వర్యంలో చౌడం జొల్లు కొండయ్య అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తమ గళాన్ని వినిపించారు. 60% జనాభాగా ఉన్న కులగణన చారిత్రక అవసరమన్నారు. సమానహక్కుల కోసం రాజకీయ రిజర్వేషన్ల కోసం, రాజకీయ ఎదుగుదల కోసం బీసీలందరు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.