ముద్దనూరు: విద్యార్థులకు బహుమతుల ప్రదానం

53చూసినవారు
ముద్దనూరు: విద్యార్థులకు బహుమతుల ప్రదానం
ముద్దనూరు మండల కేంద్రంలోని స్థానిక బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు వరల్డ్ స్పేస్ వీక్ 2024 సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో మండల స్థాయిలో గెలుపొందారు. ఈ నేపథ్యంలో వెంకట కిరణ్, మేఘన, కవితలకు కడప పట్టణంలోని కెఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లను అందచేశారు. ఉపాధ్యాయులు కుండ భాస్కర్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్