జమ్మలమడుగు ఎన్జిఓ కార్యాలయంలో బుధవారం సిఐటియు నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన విభజన హామీలు అమలు చేయలేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణం ప్రధాన కార్యదర్శి విజయ్, నాయకులు వినయ్ కుమార్ పాల్గొన్నారు.