కొండాపురం : రైలు ఎక్కుతుండగా కాలుజారి మహిళ మృతి
కొండాపురం మండలం కొండాపురం రైల్వే స్టేషన్ లో శనివారం కదులుతున్న రైలు ఎక్కుత్తూ ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కిందపడి మహిళ మృతి చెందారు. మృతురాలు యర్రగుంట్ల మండలం చిలంకూరుకు చెందిన సుజాతగా గుర్తించారు. హుబ్లీ ప్యాసింజర్ రైలు కొండాపురం స్టేషన్ లో ఆగిన సమయంలో నీళ్లు తాగేందుకు వెళ్లి తిరిగి కదులుతున్న రైలును ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కిందపడి మహిళ మృతి చెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.