ప్రొద్దుటూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని వైభోగమేతంగా నిర్వహించారు. ప్రపంచ పర్యటనలో ఉన్న శ్రీమద్ వేద వ్యాస ప్రియా స్వామి మహరాజ్ ప్రొద్దుటూరు ఇస్కాన్ వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం భగవంతుని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ మహారాజ్ చేతుల మీదుగా వెన్న లడ్డు ప్రసాదం వితరణ చేశారు. హరినామస్మరణ చేయండి సర్వ సమస్యల నుంచి బయటపడండి అని అన్నారు.