కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గురువారం ఉదయం జగన్ క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన సమయంలో భారీ ఎత్తున అభిమానులు నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ అవినాశ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.