యువతిపై హత్యయత్నం కేసులో ఉన్మాది కుప్పలపల్లె కుళాయప్ప (26)అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. సోమవారం కడప ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 24 గంటల్లో హత్య కేసును పోలీసులు సేదించారన్నారు. వేముల మండలం కొత్తపల్లికి చెందిన కుళాయప్ప తులిసాకు షర్మిలను కత్తితో పొడిచాడు. ప్రేమకు నిరాకరించడం వల్లే హత్యయత్నం చేశానని నిందితుడు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.