సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలకు ఎలాంటి అనుమతులు లేవని ఎస్ఐలు నారాయణ, విష్ణు నారాయణలు పేర్కొన్నారు. ఆదివారం పులివెందుల మండలం ఇ. కొత్తపల్లి గ్రామంలో వారు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు జూదం ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.