శ్రీ కృష్ణదేవరాయలు గొప్ప హిందుత్వవాది అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకృష్ణదేవరాయలు 554వ జయంతి సందర్భంగా వేంపల్లెలో బీజేపీ నాయకులు.. ఆయన చిత్రపటానికి పూలమాలాలు వేసి ఘనంగా నివాళులుర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వతహాగా కన్నడిగులు అయిన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించిన మహనీయుడన్నారు.