వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పులివెందులలో ఘనంగా నిర్వహించారు. శనివారం పట్టణంలోని స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన.. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ప్రజలు పంచిపెట్టారు. పారిశుధ్య సిబ్బంది, దివ్యాంగులకు దుస్తులను పంపిణీ చేశారు.