రాజంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసి పని చేద్దాం అని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు మున్సిపల్ కౌన్సిలర్లకు సూచించారు. శనివారం రాజంపేట క్యాంప్ కార్యాలయం నందు పలువురు కౌన్సిలర్లు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పించి రాజంపేటను అభివృద్ధి చేయాలంటే అందరం కలిసి నడవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.